పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు
- వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు
- హైకోర్టు ఆదేశాలను పాటించకుండా వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
- హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు
పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనాలను జప్తు చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నందుకు గాను ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
అధికారుల వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది. పెండింగ్ చలానాల విషయంలో పోలీసులు కేవలం చట్టపరంగా జరిమానా వసూలు చేయాలి తప్ప, వాహనాన్ని స్వాధీనం చేసుకునే హక్కు లేదని ఈ పరిణామం ద్వారా మరోసారి స్పష్టమైంది.